India, China Fail to Resolve Remaining Issues in Eastern Ladakh at 15th Round Of Military Talks

India, China Fail to Resolve Remaining Issues in Eastern Ladakh at 15th Round Of Military Talks

తూర్పు లద్దాఖ్ లోని మిగిలి ఉన్న వివాదాస్పద అంశాల పరిష్కారం కోసం భారత్ , చైనా జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి రాలేదు. ఇరుదేశాల మధ్య కార్ప్స్ కమాండర్ల స్ధాయిలో 13 గంటల పాటు చర్చలు జరిగాయి. చర్చలపై సంయుక్త ప్రకటన విడుదల చేసిన భారత్ , చైనా.......అతి త్వరలో ఉభయులకూ ఆమోదయోగ్యమైన తీర్మానాన్ని సాధించేందుకు చర్చలు కొనసాగించాలని నిర్ణయించాయి. సైనిక, దౌత్య మార్గాల్లో చర్చలు కొనసాగించాలని అంగీకరించాయి. రెండు పక్షాలకు అంగీకారయోగ్యమైన తీర్మానం వల్ల వాస్తవాధీన రేఖ వద్ద శాంతి, సామరస్యం నెలకొని ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొన్నాయి. తూర్పు లద్దాఖ్ లో క్షేత్ర స్ధాయిలో భద్రత, స్ధిరత్వాన్ని కొనసాగించాలని భారత్ , చైనా నిర్ణయించాయి. వివాదాస్పద అంశాల పరిష్కారంపై తమ దేశ నాయకుల మార్గదర్శకాల ప్రకారం అభిప్రాయాలను విస్తృతంగా పంచుకుంటున్నట్లు ఈ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. తూర్పు లద్దాఖ్ లో చైనా బలగాల ఉపసంహరణ కోసం భారత్ గట్టిగా ఒత్తిడి చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments